రామ్ ఏంటి అలా మారిపోయాడు !red
2019-10-29 05:01:04

హీరో రామ్ మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ ఏ సినిమా చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే, తమిళంలో సూపర్ హిట్టైన తడమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమానో కాదో తెలీదు కానీ ఒక సినిమాని మాత్రం ప్రకటించాడు రామ్. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోన్నట్టి రామ్ ప్రకటించాడు. స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

కిశోర్‌ తిరుమలది రామ్ ది హిట్‌ కాంబినేషన్‌. ఇంతకు ముందు వీరిద్దరూ ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలకు కలసి పని చేశారు. ఇప్పుడు ఈ హ్యట్రిక్‌ కాంబినేషన్‌లో ‘రెడ్‌’ అనే ఈ మూవీ తెరకెక్కనంది. ఈ సినిమాలో రామ్ కు సంబంధించిన లుక్ ను కూడా రిలీజ్ చేశారు. రామ్ మేకప్ లేకుండా బ్లాక్ కలర్లో గడ్డం పెంచి ఉన్నాడు. ఇప్పటిదాకా లవ్ స్టోరీస్ మాత్రమె తీస్తూ వచ్చిన కిషోర్ ఈ థ్రిల్లర్ ని ఎలా తెరకేక్కిస్తారో చూడాలి.

 

More Related Stories