గ్రాండ్ గా బిగ్ బాస్ ఫినాలే...మెగా పెర్ఫార్మెన్స్ లు Bigg Boss Telugu 3
2019-10-29 10:11:35

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. మొన్నటి ఎపిసోడ్ శివ జ్యోతి ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ దీపావళి జరుపుకున్నారు. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలవడంతో వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు(టాక్స్లు మినహాయించి) గెలుచుకుంటారు. అయితే, ‘బిగ్ బాస్ 3’ విజేత ఎవరో ఈ ఆదివారం తెలిసిపోనుంది. అయితే ఫినాలేలో విజేత ఎవరో తెలియడం మాత్రమే కాక ఈ సీజన్ మొత్తానికి వచ్చిన టీఆర్పీ కంటే ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.  

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారట. ఈ సీజన్ హోస్ట్ నాగార్జునతో కలిసి గ్రాండ్ ఫినాలేలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారని అంతే కాక దానికి ముందుగా హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్సులు ఫైనల్‌ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం.  బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు ఆహ్వానాలు పంపుతున్నారట. లాస్ట్ డే నాడు అందరూ ఉండేలా బిగ్ బాస్ యాజమాన్యం చూస్తోందని తెలుస్తోంది. మరి ఈసారి ఎవరు టైటిల్ గెలుచుకుంటే వారు చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్, శ్రీముఖిలకి అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ మొదలయిన నాటి నుండీ టైటిల్‌ శ్రీముఖిదే అన్నట్టు ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏమి జరగుందో ?
 

More Related Stories