ఆ నిర్మాతను కంగారు పెడుతున్న రాజమౌళి..rrr
2019-10-30 05:02:23

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు నిర్మాతలు. ఆయన డేట్స్ ఇస్తే చాలు అంటూ పండగ చేసుకుంటారు. బడ్జెట్ ఎంత పెట్టడానికైనా సిద్ధమే అంటారు. ఇప్పుడు కూడా దానయ్య కూడా ఇదే చేస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మిస్తున్నాడు ఈయన. దీనికోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లోనే రానున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా హిందీలో కూడా విడుదల కానుండటంతో ప్యాన్ ఇండియా కోసమని క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు రాజమౌళి. దానికోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.

ఇక ఇప్పుడు తాజాగా మరో విషయం బయటికి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో కొన్ని రషెస్ చూసిన రాజమౌళి.. తనకు నచ్చని సన్నివేశాల గురించి నిర్మాతతో మాట్లాడాడని తెలుస్తుంది. వాటిని రీ షూట్ చేయడానికి అతన్ని ఒప్పించాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై దానయ్య కూడా ముందు కాస్త అసహనంగా అనిపించినా కూడా రాజమౌళి చెప్పిన కారణాలు నచ్చడంతో ఓకే అనేసాడని తెలుస్తుంది. ఆయన ఉన్నాడనే ధైర్యంతో ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమే అంటున్నాడు ఈ నిర్మాత. రీ షూట్స్ చేసినా.. షెడ్యూల్స్ ప్లాన్ చేసినా కూడా అనుకున్న సమయానికి సినిమా వస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం జులై 30, 2020 న విడుదల కానుంది.

More Related Stories