ఎనిమిదేళ్ళ తర్వాత ...వాళ్ళిద్దరి మధ్య ఏదో VN adithya
2019-10-30 16:38:47

మనసంతా నువ్వే ద్వారా తొలి సినిమాతోనే సంచలన విజయం నమోదు చేసుకుని వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. అయితే తర్వాత మంచి మంచి అవాకాశాలు వచ్చినా హిట్స్ లేక పోవడంతో ఫేడౌట్ అయిపోయాడు. దాదాపు ఏడెనిమిదేళ్ళగా అసలు విఎన్.ఆదిత్య సినిమాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఆదిత్య చివరిగా తీసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ నుండి వచ్చిన ముగ్గురు. ముగ్గురు హీరోలు, హీరోయిన్స్ తో తీసిన సినిమా అస్సలు ఆడలేదు, దీంతో సైలెంట్ అయ్యారు ఆయన. ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టుకుంటున్నాడు. 

ఆ మధ్య నాని నటించిన జెర్సీ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందులో నాని కొడుకు నానితో నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడితే బాగుంటుంది నాన్నా అడచ్చు కదా, అని అడుగుతాడు, దీంతో నాని ఆట మొదలు పెడతాడు. ఇప్పుడు ఇదే సీన్ ఆదిత్య జీవితంలో కూడా జరిగిందట, అది కూడా జెర్సీ సినిమాని ఆయన కొడుకు చూశాక. తన కొడుకు అడిగినందుకు అయినా సినిమా తీస్తానని ఆయన చెప్తే ఏమోలే అనుకున్నారు. నిజంగానే ఆయన ఒక సినిమా ప్రకటించాడు. వాళ్ళిద్దరి మధ్య అంటూ ఒక సినిమా ప్రకటించారు ఆదిత్య. అయితే ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే నటిస్తున్నట్టు హింట్ కూడా ఇచ్చాడు ఆయన. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండనుందో ?

More Related Stories