పవన్ కల్యాణ్ కు సపోర్ట్ చేసిందా.. పూనమ్‌పై శ్రీ రెడ్డి ఫైర్..srireddy
2019-10-31 05:19:20

పూనమ్ కౌర్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. అప్పుడెప్పుడో పవన్ విషయంలో ఈమె చాలా వరకు టార్గెట్ అయింది. కానీ ఆ తర్వాత ఏమైందో మరి సడన్ గా ట్వీట్స్ చేయడం మానేసింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ సెన్సేషనల్ ట్వీట్స్ చేస్తూ సంచలనం రేపుతుంది. మొన్నటికి మొన్న ఈమె ట్వీట్ చేసిన విధానం చూసి అంతా షాక్ అయిపోయారు. అబద్దమాడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ.. లీడర్ మాత్రం ఎప్పటికీ కాలేడని పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. అది పవన్ కల్యాణ్ కోసమే అని అంతా అనుకున్నారు..

అందుకే ఫ్యాన్స్ కూడా ఈమెను టార్గెట్ చేసారు. ఇక ఇప్పుడు కూడా మరో ట్వీట్ చేసింది పూనమ్. తన ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయని.. ఎదుటివారి ఆలోచనలన్నీ ఊహాగానాలే అని మరో ట్వీట్ చేసింది. ఇది చూసి మరోసారి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఇదే ట్వీట్ పై శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ చేసింది. పూనమ్ కౌర్ ఇలా గోడ మీద పిల్లిలా ట్వీట్లు పెట్టకు.. ధైర్యముంటే డైరెక్ట్‌గా మాట్లాడు అంటూ ఫేస్ బుక్కులో పోస్ట్ చేసింది. పవన్, పూనమ్ మధ్యలో శ్రీ రెడ్డి రావడంతో షాక్ అవుతున్నారంతా. అసలు పవన్ కల్యాణ్ ను ఈమె సపోర్ట్ చేసిందా లేదంటే ఇంకా రచ్చ పెద్దది చేస్తుందా అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. మరి ఇదెక్కడ ఆగుతుందో చూడాలిక.

More Related Stories