రుద్రమదేవి మిస్ కావడానికి కారణమదే అంటున్న విజయశాంతి.. vijayashanthi
2019-10-31 12:54:00

సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది విజయశాంతి. ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మళ్లీ విజయశాంతిని తెరపై చూద్దామా అని వాళ్లు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పింది. తాను సరిలేరు నీకెవ్వరు కాదు.. కొన్నేళ్ల కిందే సినిమాల్లోకి రావాలని అనుకున్నట్లు వెల్లడించింది. అయితే తన మనసుకు నచ్చిన పాత్రలు రాక మానేసానని చెప్పింది ఈమె. కానీ తనకు రుద్రమదేవి సినిమా చేయాలని ఉండేదని.. దానికోసం తన ప్రొడక్షన్ హౌజ్ లోనే ఏర్పాట్లు కూడా చేసుకున్నానని చెప్పింది విజయశాంతి. కానీ అప్పుడున్న రాజకీయ కారణాల దృష్ట్యా రుద్రమదేవి చిత్రంలో నటించడం వీలు కాలేదని చెప్పింది శాంతి. తనకు నచ్చిన పాత్ర వస్తేనే మళ్లీ సినిమాలు చేద్దామని చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న తనకు అనిల్ చెప్పిన పాత్ర చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది ఈమె. ఈ కథ రెండుసార్లు చెప్పించుకుని నవ్వానని చెప్పింది విజయశాంతి. పూర్తి కథ విన్నపుడు రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నానని చెప్పింది ఈమె. మొత్తానికి అన్నీ వర్కవుట్ అయ్యుంటే అనుష్క కంటే ముందే రుద్రమదేవి పాత్రలో విజయశాంతిని చూసేవాళ్లమన్నమాట. 

More Related Stories