ఓ నా బుజ్జి  జొన్నా...కిస్సీ బాయ్...వర్మ సంచలనం   RGV
2019-10-31 17:20:25

రాంగోపాల్ వర్మను టార్గెట్ చేయడం అంటే బురదలో రాయి వేయడం లాంటిదే ఎందుకంటే వర్మ బురదలాగే అంటుకుంటే మనకు కంపు తప్ప ఆయనకి ఇంపు అన్నట్టు ఉంటుంది సంగతి. ఆయన మాటలకి, కామెంట్స్ కి కోపం తెచ్చుకున్న వారు ఆ కోపంతో ఇబ్బంది పడడమే తప్ప వర్మకు ఏం నష్టం కలగదు. తాజాగా సినిమా పరిశ్రమలో పాటల రచయితగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఆర్జీవీ అనే బురదను అంటించుకున్నాడు. తాజాగా విడుదలయిన వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ పై ఆయన తన అభిప్రాయం చెప్పాడు అది కూడా ఒక ఛానల్ వచ్చి అడిగితే. 

ఈ క్రమంలో వర్మపై పది నిమిషాల సేపు జొన్నవిత్తుల విరుచుకుపడ్డాడు. ఇక గత ఏడాది జరిగిన కాంట్రావర్సీలో జొన్నవిత్తుల చౌదరి అని కామెంట్ చేసినందుకు కాస్త గట్టిగానే ఇచ్చిన ఆయన వర్మకు పప్పు వర్మ అని పేరు పెట్టాడు. అదే టైటిల్ తో పేరడీ సినిమా తీస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందించాడు. " ఓ నా బుజ్జి  జొన్నా నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్, నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దాని కొకసారైనా ఒక స్త్రీ తో ఎంజాయ్ చెయ్యి బేబీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా, నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్, వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్, కానీ ఐ లవ్ యు డా" అంటూ కాస్త ఆవేశం తగ్గించుకో అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు వర్మ.

More Related Stories