కంటిచూపుతో చంపేస్తున్న ఇస్మార్ట్ పోరీ..nabha
2019-11-03 04:48:50

కొన్నిసార్లు హిట్ సినిమాలతో ఇండస్ట్రీకి రాకపోవచ్చు. కానీ వచ్చిన తర్వాత హిట్లు మాత్రం వారిని వెతుక్కుంటూ వస్తాయి. కొందరు హీరోయిన్ల జాతకం అలా ఉంటుంది. వాళ్ల తొలి సినిమా ఎలా ఉన్నా కూడా తర్వాత మాత్రం వరస అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నభా నటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నభా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు తెలుగులోనే పాగా వేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు వరుస అవకాశాలు ఈమె కోసం క్యూ కడుతున్నాయి. ఇప్పుడు రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. కన్నడ ముద్దుగుమ్మ కాబట్టి తెలుగు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ కావడానికి ఆలోచిస్తుంది నటేష్. ఇక ఇఫ్పుడు గ్లామర్ షో విషయంలో కూడా అమ్మడు ఫుల్ కోపరేట్ చేస్తుంది. హై రేంజ్ అందాల ఆరబోతతో ఔరా అనిపిస్తుంది నభా. ఈ మధ్యే విడుదలైన ఓ ఫోటోషూట్ లో అమ్మాయి థైస్ చూపిస్తూ మైమరిపించింది. ఇక ఇప్పుడు చాలా పద్దతిగా మారిపోయి కంటిచూపుతోనే సైగలతో ప్రాణాలు తీస్తుంది నభా నటేష్. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే మరికొన్ని రోజుల్లో స్టార్ హీరోల దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

 

More Related Stories