బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది !biggboss
2019-11-03 05:21:51

అక్కినేని నాగర్జున హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మరో రెండు రోజుల్లో ముగియనుంది. టాప్ ఫైవ్‌లో శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లుండగా ఎవరు ఈ సీజన్ విజేత అనేది రేపు రాత్రికి తేలిపోనుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ లందరూ హౌజ్‌ లోకి గెస్ట్‌ ఎంట్రీ ఇచ్చారు. కాస్త రచ్చ కూడా చేశారనుకోండి. ఇక ఎప్పటిలాగా ఎలిమినేషన్స్ మాదిరిగా టైటిల్ విజేత ఎవరనేది ఈరోజే సోషల్ మీడియాలో లీకయింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భారీ వోటింగ్ తో టైటిల్ విన్నర్ గా నిలిచాడని నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ వోటింగ్ లో శ్రీముఖి రెండో స్థానంలో నిలిచినట్లు సమాచారం. నిజానికి రీసెంట్‌గా శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ అందుకున్నట్టుగా ఓ ఫేక్ ఫొటో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ అందుకున్న శ్రీముఖి.. నాగార్జునను గట్టిగా కౌగిలించుకుని ఫుల్ ఖుషీలో ఉంది. ఈ ఫోటోని శ్రీముఖి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ మేము నెగ్గేశాము అనే ధైర్యంతో ఉండగా అదేమీ లేదని సమాచారం. ఆ ఫొటో మార్ఫింగ్ చేసిందని, శ్రీముఖి బిగ్ బాస్ ఎంట్రీ అప్పటి ఫొటోని చేతిలో ట్రోఫీ పెట్టి ఇలా మార్చారని అసలు ఫొటో సహా బయట పెట్టారు. విన్నర్‌ ఎవరో మరో కొన్ని గంటల్లో తేలిపోతుంది.  

 

More Related Stories