ఆ సినిమా నా కెరీర్‌లో అద్భుతం అంటున్న కీర్తి సురేష్..suresh
2019-11-04 16:08:49

మహానటి సినిమాతో తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది కీర్తి సురేష్. ఈ చిత్రం తర్వాత కీర్తి చేస్తున్న సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మరో నయనతార మాదిరే మారిపోతుంది ఈమె. వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓకే చెప్పేస్తుంది కీర్తి. ప్రస్తుతం 'పెంగ్విన్‌' అనే సినిమాలో నటిస్తుంది కీర్తి. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ కు బైబై చెబుతూ కాస్త ఎమోషనల్ అయిపోతుంది కీర్తి. ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ గర్భిణిగా నటిస్తుంది. మరో ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. 'పెంగ్విన్‌' షూటింగ్ అయిపోయింది.. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది.. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది కీర్తి.  త్వరలోనే సినిమా విడుదల కానుందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంతో పాటు తెలుగులో మిస్ ఇండియాలో కూడా నటిస్తుంది కీర్తి సురేష్. హిందీలో 'మైదాన్‌' అనే సినిమాతో అక్కడి వాళ్లను పలకరించబోతుంది ఈ బ్యూటీ.

More Related Stories