ఆగ్రహం అంటే పవర్ కాదు...పూనమ్ ట్వీట్ హాట్poonamkaur
2019-11-04 17:02:38

టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ మరోసారి పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యింది. ఆమె కొంత కాలంగా పవన్ కల్యాణ్  పేరును  ప్రస్తావించకుండా ఆయనపై  పరోక్షంగా  విమర్శలు  గుప్పిస్తూ  ట్వీట్లు చేస్తోంది. నిన్న విశాఖపట్నంలో పవన్  లాంగ్ మార్చ్ లో పాల్గొని అనంతరం ఉద్వేగభరింగా ప్రసంగించారు. అయితే అది జరిగిన మరుసరి రోజే పూనం కౌర్ ట్వీట్ చేసింది. ‘ఆగ్రహం అంటే పవర్ కాదు’ అని ట్వీట్ చేసింది. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు  ఆమెను విమర్శిస్తూ కామెంట్లు పెడుతూ తమ పదునైన నోటికి పని చెబుతున్నారు.

గత కొన్నిరోజుల క్రితం కూడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా పూనం ట్వీట్ చేసింది. గతంలో పూనమ్ కౌర్-పవన్ విషయంలో కత్తి మహేష్ చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్న పూనమ్ కౌర్ తాజాగా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే తన ట్వీట్ దుమారం రేపడంతో పూనమ్ కౌర్ తాజాగా మరో ట్వీట్ లో క్లారిటీ ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవి కాదని సాధారణంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తన అవగాహన మేరకు స్పందించాని చెప్పుకొచ్చింది.   న వ్యాఖ్యలు పవన్ గురించి కాదని క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఈ వివాదాన్ని వదిలేశారు. మళ్ళీ అదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ రచ్చ మొదలయ్యింది. 

More Related Stories