హీరో-నిర్మాత భార్యలు నిర్మాతలు... బై లింగ్యుయల్ మూవీ...Bobby Simha.jpg
2019-11-06 08:18:22

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. అది కాక కంటెంట్ బాగుంటే చాలు తెలుగు వాళ్ళు ఏ బాష సినిమాని అయినా నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతర బాషల నటులు కూడా తెలుగు మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. కొందరు తమ తమ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తుంటే మరి కొందరు ఏకంగా తెలుగులో సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. మరికొందరు తెలివిగా తమ బాషతో పాటు తెలుగులో కూడా బై లింగ్యుయల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో నడుస్తున్నారు తమిళ నటుడు బాబీ సింహా. ఈయన ఎవరో ఇప్పుడు పెద్దగా గుర్తు పట్టలేరు ఎందుకంటే ఈయన రెండు మూడు తెలుగు సినిమాలు చేసినా అవి పెద్దగా హిట్ కాలేదు కాబట్టి. 

ఇక ఈయన లీడ్ రోల్ లో నటించిన జిగార్తాండ సినిమానే తెలుగులో గద్దలకొండ గణేష్ గా తెరకెక్కించారు. అందులో బాబీ చేసిన పాత్రనే ఇక్కడ వరుణ్ నటించి మెప్పించాడు. ఈయన ఇప్పుడు రవితేజ డిస్కో రాజా సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన హీరోగా ఈరోజు ఒక సినిమా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ బాషలలో ఏకకాలంలో తెరకెక్కనుంది.ఈ సినిమాని పవన్ కి సన్నిహిత నిర్మాత రామ్ తాళ్ళూరి భార్య రజని తాళ్ళూరి, బాబీ సింహా భార్య రేష్మి సింహా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా ఒక క్రైం కామెడీ ఫిలిం అని ఈ సినిమాలో బాబీ సరసన కాశ్మీరా పరదేశి నటించనుందని సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరయిన రజని జనసేనలో యాక్టివ్ మెంబర్ కూడా.

More Related Stories