మరో హీరోయిన్ తో డేటింగ్ మొదలెట్టిన కమల్kamal
2019-11-09 07:18:00

విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్లతో సహజీవనం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తమిళ మీడియా కధనాలు వండి వార్చింది. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల కమల్ తన 65వ బర్త్‌డే జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పరమకూడిలో కమల్ హాసన్ తన కుటుంబీకులను కలిశారు. వారంతా కలిసి ఫ్యామిలీ ఫొటో దిగారు. ఈ ఫొటోలో ఒక హీరోయిన్ కూడా ఉండడంతో ఈ వార్తలకి బేస్ దొరికినట్టు అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ నటి పూజా కుమార్.

కమల్, పూజ జంటగా ‘విశ్వరూపం’ సినిమాలో నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాదిగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎందుకంటే గతేడాదిగా కమల్ హాసన్ ఏ ముఖ్య కార్యక్రమాలకు వెళ్లినా పూజా కుమార్ ‌ఆయనకు తోడుగా వెళుతూనే ఉంది. తాజాగా బయటికి వచ్చిన వీరిద్దరి ఫొటో చూస్తే ఆ రూమర్స్ నిజమేనేమో అనేంతలా అక్కడి మీడియా కధనాలు ప్రసారం చేసింది. నిజానికి 1978లో కమల్ హాసన్ వాణి గణపతి అనే నటిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు కలగాకుండానే పదేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నటి సారికను పెళ్లి చేసుకున్నారు.

వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. ఆ తర్వాత సారికతోనూ కమల్ బంధం తెచ్చుకున్నారు. కొన్నాళ్ల అనంతరం నటి గౌతమితో సహజీవనం చేశారు. ఏమైందో ఏమో కానీ ఆమెతోనూ కమల్‌కు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంటో ఇటీవల కాలంలో వీరిద్దరూ తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు ఫ్యామిలీ పిక్ లో పూజా కుమార్‌ కనిపించడంతో ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పక్క రాజకీయాలలో తన దైన ముద్ర వేయాలని చూస్తున్న కమల్‌కు ఇలాంటి చిలక్కొట్టుడు వ్యవహారాలు లేకున్నా మీడియాలో వచ్చే కధనాలనే జనాలు నమ్మే అవకాశం ఉంది. 

More Related Stories