షాకింగ్.. మెగాస్టార్‌కు అనారోగ్యం.. పూర్తిగా బెడ్ రెస్ట్.. Amitabh Bachchan
2019-11-11 17:10:31

మెగాస్టార్ చిరంజీవికి అనారోగ్యమా..? ఆయన మళ్లీ హాస్పిటల్ వెళ్తున్నాడా అని కంగారు పడుతున్నారా..? ఇక్కడ మెగాస్టార్ అంటే తెలుగు కాదు.. ఇండియన్ మెగాస్టార్ గురించి మనం మాట్లాడుకునేది. ఆల్ ఇండియాకు ఒక్కడే మెగాస్టార్ అంటూ చిరంజీవే చెప్పాడు.. ఆయనే అమితాబ్ బచ్చన్. ఇఫ్పుడు ఆయన షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులను ఎమోషన్ అయ్యేలా చేస్తుంది. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడ్డారు. హాస్పిటల్లోనే ఉన్నారు.. మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అది చూసిన అభిమానులు అమితాబ్ గారూ.. మీ ఆరోగ్యానికి ఏం కాదు.. మేమంతా మీ వెంటే ఉన్నామంటూ ట్వీట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అలుపెరుగని యోధుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. 70 దాటిన తర్వాత జోరు ఇంకా పెంచేసాడు. దాంతో అసలటతో అనారోగ్యం బారిన పడ్డాడు మెగాస్టార్. దాంతో వైద్యులు కూడా కొన్ని రోజుల వరకు సినిమాలు చేయొద్దని సూచించారు.. ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు మాకు ఎంతో విలువైన అమూల్యమైన స్టార్.. మీకోసం దేవుడిని ప్రార్థిస్తామని ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ మధ్యే అమితాబ్ కోల్ కత్తా ఇంటర్నేషనల్ ఫిలింపెస్టివల్స్ కి రావాల్సింది.. కానీ అనారోగ్యం కారణంగా రాలేకపోయానని అమితాబ్ వెల్లడించారు. అయితే అవన్నీ తర్వాత.. ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు ఫ్యాన్స్. చాలా రోజులుగా టీబీ.. లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులతో బాధ పడుతున్నాడు అమితాబ్. దానికితోడు వయసు కూడా మించుతుండటంతో ధీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. మొత్తానికి మెగాస్టార్ ఆరోగ్యం కుదుటపడటానికి మరికొన్ని రోజులు పడుతుంది. 

More Related Stories