మనోజ్ కొత్త సినిమా - నభా ఫిక్స్ అయిందాmanoj
2019-11-14 12:08:52

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు సినీ కెరీర్ మొత్తంలో చెప్పుకోతగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా విష్ణు కి డీ లాంటి హిట్ ఉన్నా ఈయనకి అది కూడా లేదు. కొంత కాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. విడాకులనంతరం మళ్ళీ సినిమాలు మొదలు పెడుతున్నారు. దీపావళి సందర్భంగా మంచు మనోజ్ కూడా తన కొత్త జర్నీకి శ్రీకారం చుట్టి ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నా సొంత నిర్మాణ సంస్థ ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’నిర్మాణంలోనే నా తదుపరి చిత్రాలు వస్తాయి… అదేవిధంగా కొత్త టాలెంట్‌ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను.

భవిష్యత్‌ లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారని తెలిపాడు. ఇక ఇప్పుడు తాజాగా తన బ్యానర్ లో వస్తున్న సినిమాపై మరో న్యూస్ వినిపిస్తుంది. ఆయన నిర్మిస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయట. మరో రెండు రోజుల్లో ఈ సినిమాను ప్రారంభినచనున్నట్టు తెలుస్తుంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.   

 

More Related Stories