ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ స్వీట్ వార్నింగ్..jagan
2019-11-20 12:32:36

ఏమో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. దీనికి గల కారణాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం రాజకీయాలతో పాటు బుల్లితెర పై కూడా బిజీగా ఉంది. గత ప్రభుత్వంలో ఆమె కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంది. కానీ ఈ సారి ఆమెపై బాధ్యతలు పెరిగాయి. రోజా పై ఉన్న నమ్మకంతో ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కూడా ఆమెకు అందించాడు ముఖ్యమంత్రి జగన్. దాంతో అదనపు బాధ్యతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో కూడా ఒకవైపు రాజకీయాలు మరోవైపు బుల్లితెర షోస్ చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తుంది రోజా. అయితే సినిమాల వైపు ఫోకస్ ఎక్కువైపోయి రాజకీయాల్లో దృష్టి తగ్గిపోతుందని రోజాపై కొంత మంది వైసిపి నాయకులు సీఎం జగన్ చెవిన వేశారని తెలుస్తోంది.

దాంతో ఆయన కూడా ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకొని పాలిటిక్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలని రోజాకు సున్నితంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె బుల్లితెరపై ఇప్పుడు బతుకు జట్కా బండితో పాటు జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా ఉంది. ఏడేళ్లుగా ఈ షో చేస్తుంది రోజా. అయితే ఇప్పుడు నాగబాబు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు. దాంతో రోజా కూడా జబర్దస్త్ మానేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికితోడు వైయస్ జగన్ కూడా రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీరియస్ గా చెప్పడంతో బుల్లితెరకు పూర్తిగా దూరం అవడానికి ప్లాన్ చేసుకుంటోంది రోజా. మరి ఈమె ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories