యాంకర్ ను గోకిన సీనియర్ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే..anchor
2019-11-24 11:28:39

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా కూడా ఎఫైర్స్ అనేవి కామన్. అప్పుడప్పుడూ మన హీరోలు కూడా అదుపు తప్పుతుంటారు. పార్టీలకు, ఈవెంట్స్ కు వెళ్లినపుడు అక్కడ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పట్లో ఓ సారి అమెరికా వెళ్లినపుడు ఓ సీనియర్ స్టార్ కమెడియన్ అక్కడున్న ఓ అమ్మాయిని గెలికితే వాళ్లు అతడిని భడితపూజ చేసి పంపించారని వార్తలొచ్చాయి. మళ్లీ అలాంటి ఘటనే ఇఫ్పుడు రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ కొట్టలేదు కానీ ఈ సీనియర్ హీరో సదరు యాంకర్ ను గోకాడని తెలుస్తుంది. అసలు నిప్పులేనిదే పొగ రాదంటారు కదా. అందుకే ఇప్పుడు అలాంటి నిప్పు హీరో రాజేసాడని.. దానికి యాంకర్ కూడా స్ట్రాంగ్ సమాధానం చెప్పిందని ప్రచారం జరుగుతుంది. అసలు ఎవరా యాంకర్.. ఆమెను గోకిన ఆ సీనియర్ హీరో ఎవరు.. అన్న విషయం ప్రస్తుతం సస్పెన్స్.

తాజాగా ఓ రేడియో జాకీ తాను చేయబోతున్న ఓ ఈవెంట్ కు సంబందించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆ సీనియర్ హీరో దగ్గరికి వెళ్లిందని.. అయితే హాట్ గా ఉన్న ఆ భామను చూసి మన సార్ గారూ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయాడని తెలుస్తుంది. అక్కడితో ఆగకుండా తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టేసాడు కూడా. ఇన్విటేషన్ అందుకున్న తర్వాత నువ్వు మంచి యాంకర్ కమ్ రైటర్ అంటున్నారు.. మరి త్వరలోనే నా బయోపిక్ ప్లాన్ చేస్తున్నాను.. దాన్ని ముందు పుస్తక రూపంలో తీసుకొచ్చే పని నువ్వు చేస్తావా అని అడిగాడని తెలుస్తుంది. అక్కడితో ఆగితే బాగున్ను కానీ అక్కడ్నుంచి అసలు కథ షురూ అయింది. ఇక్కడ కుదరదు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఏదైనా మంచి రిసార్ట్ కు వెళ్లి అక్కడ మన బయోపిక్ పనులు చేసుకుందాం అన్నాడట.. దాంతో యాంకర్ కూడా పెద్ద హీరో కాబట్టి ఏం మాట్లాడలేక ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత చూసుకుందాంలెండి సర్ అంటూ మెల్లగా జారుకుందని తెలుస్తుంది.

More Related Stories