వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీ రెడ్డి.. నాతో పెట్టుకుంటే..Sri Reddy
2019-11-25 11:59:58

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీరెడ్డి ని మించిన కాంట్రవర్సి టాపిక్ మరొకటి లేదు. ఎప్పుడు ఎవరిపై ఈ బాణం దూసుకుపోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ఇప్పుడు కూడా మరోసారి శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో కొందరిని టార్గెట్ చేసింది. అయితే ఈ సారి ఆమె లక్ష్యంగా చేసుకొని వదిలిన బాణాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. దానికి కారణం అది మీడియా కావడమే. అసలు వార్తల్లో లేని శ్రీ రెడ్డిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా. ఈ మూడు లేకపోతే అసలు శ్రీరెడ్డి అంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఆమె గురించి కొన్ని వేల వార్తలు రాసి ఈరోజు స్టార్ గా మార్చేశాయి. తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీరెడ్డి గురించి తెలియని వారు లేరు.. ఇంకా మాట్లాడితే అప్పట్లో నేషనల్ మీడియా కూడా శ్రీ రెడ్డి పై ఫోకస్ చేసింది. 

ఇంతా చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా పై ఓ రేంజులో విరుచుకుపడింది శ్రీ రెడ్డి. ఈ యూట్యూబ్ చానెల్స్ పై ఆమె తన ఫేస్ బుక్ పేజీలో సంచలన పోస్ట్ పెట్టింది. మీ ఇష్టం వచ్చినట్లు నా వీడియోలు స్పూఫ్స్ చేసి పెడుతుంటే ఇకమీద చూస్తూ ఊరుకోలేను.. పిచ్చి పిచ్చి వీడియోలు పోస్ట్ చేస్తే నా విశ్వరూపం చూపిస్తా అంటూ తెలుగు తమిళ యూట్యూబ్ చానల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఇప్పటినుంచి ఏదైనా తన వీడియో గాని ఫోటోలు గాని అసభ్యకరంగా ఉన్నవి పోస్ట్ చేస్తే కచ్చితంగా వాళ్ళ తాటతీస్తా అంటూ రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా జీరో నుంచి హీరో గా మార్చిన వాళ్లను కూడా ఇలా హెచ్చరించడం ఏమాత్రం బాగోలేదు అంటూ శ్రీ రెడ్డి పై నెటిజన్ల సెటైర్లు కురిపిస్తున్నారు.

More Related Stories