త్వరలో సెట్స్ మీదకి హిందీ జెర్సీ Shahid Kapoor
2019-11-27 16:40:02

తెలుగులో విజయవంతమైన `జెర్సీ` మూవీ బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి తెల్సిందే. దిల్ రాజు అల్లు అరవింద్ లు అమన్ గిల్ అనే నిర్మాతతో కలసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. ఇందులో కూడా తాజాగా తెలుగు రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట. ఇందులో హీరోయిన్‌గా రష్మికను నటింప చేయాలని ట్రై చేసినా అది కుదరలేదు దీంతో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ ని ఎంపిక చేశారు. ఒరిజినల్ ని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌ 2న ప్రారంభం కానుందని సమాచారం. కథ మొత్తం 1990 నాటి ఛండీఘడ ప్రాంతం నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. సినిమా షూటింగ్‌ని చంఢీఘడ్ లోని క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభించనున్నారట. అక్కడే మొదటి షెడ్యూల్ మొత్తం షూటింగ్‌ జరపునున్నారట. కొంత ఇండోర్‌ మరికొన్ని సన్నివేశాలను అవుట్‌డోర్‌లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం.  ఇప్పటికే షాహిద్ క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 28, 2020న రిలీజ్ కానుంది.

More Related Stories