కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదలకు బ్రేకులు..RGV
2019-11-28 17:13:12

రాంగోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 29న విడుదలవుతుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు ఆయన. అయితే విడుదలకు సెన్సార్బోర్డు బ్రేకులు వేసింది  విడుదల తేదీ 24 గంటల సమయం మాత్రమే ఉన్న ఇప్పటికీ సెన్సార్ కాలేదు. ఇప్పటికే సెన్సార్ కోసం అప్లై చేసుకున్న కూడా సభ్యులు ఈ సినిమాను ఇంకా చూడకపోవడం వర్మకు అసహనం తెప్పిస్తుంది. ఈ సినిమాను చూసి వారం రోజుల్లోగా అభ్యంతరకర సన్నివేశాలపై ఒక రివ్యూ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 

మరోవైపు రాంగోపాల్ వర్మ ఈ సినిమా టైటిల్ మారుస్తున్నట్లు ప్రకటించాడు. సినిమా చూసిన తర్వాత సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించడానికి కూడా వర్మ టీం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. కానీ అసలు సెన్సార్ సభ్యులు సినిమా చూడకపోవడం ఆశ్చర్యకరంగా మారుతుంది. ఈ సినిమాకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాడు. సెన్సార్ బోర్డు తీరుపై రివిజన్ కు వెళ్లాలని చూస్తున్నాడు రాంగోపాల్ వర్మ. అఫిడవిట్ దాఖలు చేయబోతున్నాడు ఈయన. ఒకవేళ నవంబర్ 29న విడుదల చేయకపోతే మీడియా ముందుకు వచ్చి తన సత్తా చూపించాలి ప్రయత్నిస్తున్నాడు వర్మ. 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్స్ సాంగ్స్ అన్ని ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. కేవలం కాంట్రవర్సీ కోసమే ఈ సినిమా తీసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా విడుదలైతే కమ్మ కాపు వర్గాల మధ్య చిచ్చు పెడుతుందని.. అందుకే సినిమా విడుదల ఆపు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. దీనిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి చాలా వివాదాల మధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మరి ఇది అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

More Related Stories