ఆర్ఆర్ఆర్ నుండి మూటా ముల్లే సర్దేసిన ఆలియాaliabhatt
2019-11-29 12:22:04

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. తెలుగు నాడు నుండో స్వతంత్రం కోసం పోరాడిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలను కలుపుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో ఎప్పుడూ ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే డెబ్బై శాతం షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఆలియా భట్‌ మూటా ముల్ల్లా సర్దేసిందట. ఓర్నీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంటే ఇదేమా అనుకోకండి ఆమెను రాజమౌళి స్వయంగా ఆమెను దగ్గరుండి సంతోషంగా సాగనంపారట.

అదేంటి ఆలియా మూటా ముల్లే సర్దేసుకుంటే జక్కన్న ఆనందంగా పంపించెయ్యడమేంటి అని కంగారు పడకండి. ఆర్‌ఆర్‌ఆర్‌ లో ఆలియాకు సంబంధించిన పాత్ర చిత్రీకరణ పూర్తయిందట. అందుకే చిత్ర బృందం ఆమెకు గ్రాండ్‌గా సండాఫ్‌ ఇచ్చి సంతోషంగా ముంబయికి పంపించారని అంటున్నారు. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ మంచి కీలక పాత్ర అట. ఇక ఎన్టీఆర్‌ - ఒలివియా మోరిస్‌లపై కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే క్లైమాక్స్‌ సీక్వెన్స్ ను కూడా షూట్ మొదలు పెట్టచ్చని అంటున్నారు. ఈ సినిమాని దాదాపు 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

More Related Stories