అసలు కమ్మ రాజ్యంలో సినిమా విడుదల అవుతుందా..RGV
2019-11-30 22:21:54

రాంగోపాల్ వర్మ కు తెలుసు.. ఇలాంటి వివాదాస్పద సినిమాలు తీస్తే కచ్చితంగా విడుదలకు ముందు తిప్పలు తప్పవని. అయినా కూడా ఆయన ఎవరి మాట వినడు. తాను అనుకున్న సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెర మీద చూపించే వరకు నిద్రపోవడం అసలు తెలియదు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు. ఈ ఏడాది ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి దాన్ని విడుదల చేయడానికి నానా తిప్పలు పడ్డాడు రామ్ గోపాల్ వర్మ. తెలంగాణలో విడుదలయింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు నెలలు వేచి చూసిన తర్వాత కాని విడుదల కాలేదు. ఇప్పుడు మల్లి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు కూడా ఇదే తిప్పలు వచ్చేలా కనిపిస్తోంది.

తెలంగాణలో ఈ సినిమా విడుదల కాకపోవడానికి పెద్దగా అడ్డు కాని అడ్డంకులు ఏమీ లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల అయ్యేలా కనిపించడం లేదు. పైగా హైకోర్టు వ్యతిరేకంగా ఉండటంతో కమ్మ రాజ్యంలో ఇప్పట్లో విడుదల కావడం కష్టంగానే కనిపిస్తోంది. వారం రోజుల తర్వాత సెన్సార్ బోర్డు ఈ సినిమాపై తమ నిర్ణయాన్ని చెప్పనున్నారు. అయితే ఒకవేళ ఇందులో వివాదాస్పద సన్నివేశాలు ఉంటే మాత్రం ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు రావడం కాదు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. దానికి తోడు ఒక వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు కె.ఎ.పాల్ కూడా ఈ సినిమా పై నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇంత మంది కోపాన్ని ఆగ్రహాన్ని దాటుకొని ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు.

More Related Stories