పవన్ ఒక్కడే టార్గెట్.. చిరంజీవి కాదు అంటున్న వర్మ.. Ram gopal Varma
2019-11-30 17:28:11

ఎందుకో తెలియదు కానీ కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీ అంటే రామ్ గోపాల్ వర్మకు అస్సలు పడటం లేదు. ఆ కుటుంబంలో చాలా మంది హీరోలను ఎప్పటికప్పుడు తమ సినిమాలతో లేదంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు కాస్త హద్దుల్లో ఉన్న వర్మ ఇప్పుడు మరి మితిమీరి మెగాఫ్యామిలీపై పడిపోతున్నాడు. 

తాజాగా ఆయన తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఏకంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను కమెడియన్ లా చూపించేసాడు. ఇది చూసిన తర్వాత మెగా అభిమానుల్లో కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. వర్మ కనిపిస్తే కొడతాము అంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఈ విషయంపై ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మనసులో మాట బయట పెట్టాడు వర్మ. చిరంజీవిని కాకుండా అస్తమానం పవన్ నే ఎందుకు ట్రోల్ చేస్తాడో క్లారిటీ ఇచ్చాడు.

 ప్రస్తుతం వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో పవన్ లానే ఒక పాత్రను పెట్టాడు. పవన్ మాటలు అతని పద్ధతి వల్లే ట్రోల్ చేస్తున్నామని అన్నారు. పవన్ ని ట్రోల్ చేస్తాం తప్పా చిరంజీవిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు వర్మ. పైగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ట్రోల్ చేసినట్టు మాజీ అధ్యక్షుడు ఒబామాని ట్రోల్ చెయ్యలేము కదా అని ప్రశ్నిస్తున్నాడు వర్మ. చాలా రోజులుగా పవన్ ను భారీగానే టార్గెట్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. 

గతేడాది పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళినప్పుడు కాలినడకన స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మధ్యలో కొన్ని సార్లు ఆయాసంతో కూర్చున్న ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటిని కూడా ట్రోల్ చేశాడు వర్మ. ఖైదీ నెంబర్ 150 సినిమా ఆడియో వేడుకలో నాగబాబు అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మరి ఈ దర్శకుడు చివరికి మెగా ఫ్యామిలీని ఇంకా ఏ రేంజ్ లో ఆడుకుంటాడో చూడాలి.

More Related Stories