చంచల్ గూడా జైల్ దగ్గర విజయ్ దేవరకొండ..

అవునా నా విజయ్ దేవరకొండ జైలుకు ఎందుకు వెళ్లడం అయినా చంచల్గూడా వైపు ఈయనకు ఏంటి అని అనుకుంటున్నారా ప్రస్తుతం ఆయన నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ జరుగుతుంది ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చంచల్గూడ జైలు సమీపంలో చిత్రీకరించాడు దర్శకుడు క్రాంతి మాధవ్ విజయ్ దేవరకొండ వచ్చాడని తెలియడంతో ఆ ఏరియా మొత్తం సందడిగా మారింది. మీడియా ప్రతినిధులు, ఓబీ వ్యానులు, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడం చూసి ములాఖత్ దారులు, జైలుసిబ్బంది, వారి కుటుంబసభ్యులు అయోమయానికి గురయ్యారు. అయితే అదంతా షూటింగ్ లో భాగం అని తెలుసుకుని ఆశ్చర్య పోయారు జైలు నుంచి అడ్వకేట్ తో కలిసి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండను మీడియా ప్రతినిధులు మాట్లాడమని వెంటబడుతున్నటు వంటి పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ లాయర్ పాత్రలో కమెడియన్ ప్రియదర్శి నటించాడు. ఇప్పటికే వరల్డ్ ఫేమస్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నాడు నిర్మాత కె.ఎస్.రామారావు. ఈ సినిమాలో కేథరిన్ త్రేసా, ఐశ్వర్య రాజేష్, రాశిఖన్నా, ఎజెబిల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కెరీర్ కు వరల్డ్ ఫేమస్ లవర్ కీలకంగా మారింది.