సాహో నుంచి ప్రభాస్ ఏం నేర్చుకున్నాడు.. మళ్లీ అదే తప్పు..prabhas
2019-12-07 04:42:54

ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సాహో ప్రభాస్ పెద్దగా ఏమి నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఈ సినిమాలో గ్రాండియర్ తప్ప కథ కొత్తగా లేదు అంటూ విమర్శలు వచ్చాయి. దాని ఫలితమే కలెక్షన్లు కూడా. ఒక్క హిందీ తప్ప ప్రతి భాషలో కూడా సాహో ఫ్లాప్ అయింది. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి విజువల్ రిచ్ గా ఉండాలి అనుకున్నారు కానీ కథ కూడా అదే స్థాయిలో ఉండాలని దర్శక నిర్మాతలు ఊహించలేకపోయారు. దాని ఫలితమే సాహో పరాభవం. 400 కోట్లు వచ్చాయని నిర్మాతలు చెప్పుకుంటున్న కూడా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలు తీసుకువచ్చింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను కూడా దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణను నమ్మి మరోసారి రిస్కు తీసుకుంటున్నాడు ప్రభాస్. పైగా ఈ కథ ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాల కిందట జరిగిన నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజర్ గా నటిస్తున్నాడు. జాతకాలు చెప్పడం ఆయన వృత్తి. అలాంటి ప్రేమ కథ ఇది. కనీసం సాహోలో యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇందులో కేవలం కథ మాత్రమే ఉంటుందని.. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలు కూడా తక్కువగానే ఉంటాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా సినిమా లవ్ స్టోరీ అంటున్నారు దర్శక నిర్మాతలు. సాహో ఫలితం చూసిన తర్వాత కొన్ని రోజులు ఆపి జనవరి నుంచి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలని చూస్తున్నాడు ప్రభాస్. కథపై మరోసారి కూర్చోవాలని దర్శక నిర్మాతలకు చెప్పాడు ఈ హీరో. వచ్చే ఏడాది చివర్లో రాధాకృష్ణ కుమార్ సినిమా విడుదల కానుంది. ఐదేళ్ల కింద జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు రాధాకృష్ణ కుమార్. మరి సాహో నుంచి ప్రభాస్ ఎంతవరకు తప్పులు తెలుసుకున్నాడో చూడాలి.

More Related Stories