దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అన్యాయం.. టాలీవుడ్ కమెడియన్ ట్వీట్..rahul
2019-12-08 07:49:19

దిశ నిందితుల ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం.. హత్య సంఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేసింది. గత పది రోజులుగా ఎక్కడ విన్నా కూడా ఇదే టాపిక్ నడుస్తుంది. హత్యాచారం.. ఒక్కరోజులోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం.. పది రోజులు కూడా తిరక్కుండానే వాళ్లను ఎన్‌కౌంటర్ చేయడంతో చాలా మంది దీనిపై హర్షం వ్యక్తం చేసారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై అంతా తమ స్పందన తెలియజేసారు. అందులో దాదాపు అందరూ సపోర్ట్ చేసినా కూడా మంచు లక్ష్మి లాంటి వాళ్లు ఇలా చంపుకుంటూ పోతే పరిష్కారం దొరకదు కదా.. అదే పెద్దవాళ్ల పిల్లలు అయితే చంపేస్తారా అంటూ ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలోనూ నిజం లేకపోలేదు అంటున్నారు కొందరు. ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా ఈ ఘటనపై సంచలన ట్వీట్ చేసాడు. ఈ ఎన్‌కౌంటర్ న్యాయం కాదని చెప్పాడు రాహుల్. ఊహకందని ప్రజల కోపాన్ని చల్లార్చేందుకు ఇలా చంపేసారు..

అసలు నేరం జరక్కుండా చట్టాలను తీసుకొచ్చినప్పుడే అసలైన న్యాయం జరిగినట్లు కానీ ఇలా ఎన్‌కౌంటర్ చేసినపుడు కాదని చెప్పాడు రాహుల్. అక్కడితో ఆగకుండా మన చట్టాలపై పోలీసులకు ఎంత గౌరవం ఉందో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం అంటూ రాసుకొచ్చాడు రాహుల్. ఇక మన భారతీయుల దృష్టిలో రాజ్యాంగానికి ఎంత తక్కువ విలువుందో కూడా ఇప్పుడు ఎన్‌కౌంటర్‌తో మరోసారి అర్థమైపోయిందంటూ ట్వీటేసాడు. చివర్లో ఇగ నుండి కోర్టులూ.. లాయర్లూ పని మానేసుకోవచ్చేమో.. చట్టం పీస్ఫుల్ గా పండుకోవచ్చు! నేరాలకి ఫుల్ స్టాప్ కలిగిచ్చేశిర్రు. మహిళలకు అంతులేని స్వేచ్ఛ గారెంటీ అంటూ ముగించాడు రాహుల్. ప్రస్తుతానికి రాహుల్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో బాగానే సంచలనం అవుతున్నాయి.

More Related Stories