అందరిముందు వెంకటేష్ కు ఐ లవ్ యు చెప్పి పాయల్ రాజ్ పుత్..payal
2019-12-08 18:12:41

పాయల్ రాజ్ పుత్ అంటే ఇప్పటి వరకు ఒకే రకమైన ఇమేజ్ ఉంది. అదే అడల్ట్ ఇమేజ్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఆ రకమైన ఇమేజ్ తెచ్చుకుంది. ఆర్డిఎక్స్ లవ్ సినిమా కూడా ఇదే కోవలోకి రావడంతో ఈమె నటించిన సినిమాలు అడల్ట్ కంటెంట్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో వెంకీమామ లాంటి క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది పాయల్ రాజ్ పుత్. దాంతో ఇలాంటి అవకాశం తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలను ఓ రేంజ్ లో పొగిడింది ఈ ముద్దుగుమ్మ. ఇక హీరో వెంకటేష్ తో నటించిన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంటూ తానేం చేస్తుందో.. ఏం మాట్లాడుతుందో అనే విషయాన్ని కూడా మరిచిపోయింది పాయల్ రాజ్ పుత్. తాజాగా వెంకీ మామ ప్రీ రిలీజ్ వేడుకలో అందరి ముందు వెంకటేష్ కు ఐ లవ్ యూ అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అది విని అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఈ హీరోయిన్ ఏంటి ఇంత ధైర్యంగా వెంకటేష్ కు అలా ఐ లవ్ యు చెప్పేసింది అంటూ ముక్కున వేలేసుకున్నారు.

అంతేకాదు వెంకటేష్ తో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. కల నిజమైనట్లు ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. తన కెరీర్లో ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదని.. ఆ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబికి రుణపడి పోతాను అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. వెంకటేష్ నుంచి చాలా నేర్చుకున్నానని..  ముఖ్యంగా లైఫ్ లో ఎలా ఉండాలి క్రమశిక్షణగా ఎలా మెలగాలి అనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన స్పీచ్ వెంకటేష్ ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఇదంతా చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కాస్త పరేషాన్ అయ్యారు. కెరీర్లో తొలిసారి పెద్ద సినిమాలో నటించే అవకాశం రావడంతో స్టేజిపై ఏం చేస్తున్నాను అనేది పూర్తిగా మరిచిపోయింది పాయల్ రాజ్ పుత్.

More Related Stories