అప్పుడు హిట్స్ కొట్టారు.. మళ్లీ ఫ్లాపుల్లో పడిపోయారు..ravi
2019-12-10 19:39:04

కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీని దున్నేస్తున్న టైమ్ లో ఫ్లాపులు రావ‌డంతో కుర్ర హీరోల‌కు క‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. ముగ్గురు హీరోలు ఇప్పుడు విజ‌యం కోసం తంటాలు ప‌డుతున్నారు. ఈ లిస్ట్ లో నితిన్ ముందున్నాడు. ఈయ‌న‌కు అ..ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ హిట్ లేదు. లై డిజాస్ట‌ర్.. ఛ‌ల్ మోహ‌న్ రంగా ఫ్లాప్.. శ్రీ‌నివాస క‌ళ్యాణం డిజాస్టర్.. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈయన. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి, వెంకీ అట్లూరి, వెంకీ కుడుములతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇష్క్.. గుండెజారి.. హార్ట్ ఎటాక్.. అ..ఆ లాంటి సినిమాల త‌ర్వాత మ‌ళ్లీ ఫ్లాపుల్లో ప‌డిపోయాడు నితిన్. ఇక నిఖిల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు.

స్వామిరారా.. కార్తికేయ‌.. సూర్య వ‌ర్సెస్ సూర్య‌.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. లాంటి సినిమాల‌తో మెప్పించాడు. కానీ రెండేళ్లుగా మ‌ళ్లీ నిఖిల్ కు ఫ్లాపులు త‌ప్ప‌డం లేదు. కేశ‌వ యావ‌రేజ్ అయితే.. కిరాక్ పార్టీ ఫ్లాప్. దాంతో ఇప్పుడు అర్జున్ సురవరం కూడా ప్రభావం చూపించలేదు. దాంతో కార్తికేయ 2తో రానున్నాడు. రవితేజ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. ఈయనకు కూడా రాజా ది గ్రేట్ తర్వాత హిట్ లేదు. డిస్కో రాజాపైనే ఈయన ఆశలు ఉన్నాయి. వాళ్ళతో పాటు మరికొందరు హీరోలు కూడా హిట్లు కొట్టి ఫ్లాపుల్లో పడిపోతున్నారు. వాళ్లెలాగైనా మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.

 

More Related Stories