విడుదలకు ముందే అల్లు అర్జున్‌ సినిమా మరో రికార్డు Ala Vaikuntapurramloo teaser
2019-12-12 12:26:19

అల వైకుంఠపురములో సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్‌ సౌత్‌ ఇండియా సినిమా రికార్డులను బద్దలు కొట్టగా.. తాజాగా విడుదలైన టీజర్‌ కూడా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 7నిమిషాల్లోనే టీజర్‌కు 1 మిలియన్‌ రియల్‌ టైమ్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే యూట్యూబ్‌లో విడుదలైన ఒక టీజర్‌కు అతి తక్కువ సమయంలో 1 మిలియన్‌ వ్యూస్‌ రావడం ఇదే తొలిసారి. ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి విడుదలైన ‘సామజవరగమన’ పాట రికార్డు వ్యూస్ సాధించింది. టీజర్‌ చూసి అద్భుతం అంటూ సంతోషం వ్యక్తం చేస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఈ రికార్డులు మరింత ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ సైతం ట్విట్టర్ ద్వారా ఈ రికార్డును అభిమానులతో షేర్ చేసుకున్నారు.

More Related Stories