కేఏ పాల్‌పై అటాక్ ఏంటి వర్మ.. ఏం చేద్దామని..paul
2019-12-13 12:13:06

రాంగోపాల్ వర్మ మరోసారి షాక్ ఇచ్చాడు. అది కూడా చెప్పి మరి ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సారీ సారి అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాపైనే ఉంది. ఇందులో ఒక్కొక్క పాట ట్రైలర్ ఫోటోలు విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచేసాడు వర్మ. కానీ ఇఫ్పుడు విడుదలైన తర్వాత చూస్తుంటే ఏం లేదు.. అంతా తుస్ అనిపిస్తుంది అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ట్రైలర్, పాటల్లో చూపించిన సత్తా సినిమాలో లేదంటున్నారు వాళ్లు. ఇక ఈ చిత్రంలో కొన్ని పాత్రలను తనకు నచ్చినట్లు మార్చేసుకున్నాడు వర్మ. ఆల్రెడీ సెన్సార్ కట్స్ తో నవంబర్ 29న రావాల్సిన సినిమా కాస్తా డిసెంబర్ 12న విడుదలైంది. ఇప్పుడు విడుదలైన తర్వాత చూస్తుంటే అందులో కొన్ని పాత్రలు చేస్తున్న కామెడీ చూసి నిజంగానే వర్మకు పిచ్చి పట్టిందని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.

ముఖ్యంగా కేఏ పాల్ పై ఈయన సినిమాలో అటాక్ చేయించాడు. ఏకంగా చంపించబోయాడు.. మరోవైపు దేవినేని ఉమ పాత్రను అయితే నడిరోడ్డుపై చంపించేసాడు. ఈ సినిమాలో కేఏ పాల్ కామెడీ కూడా ఇష్టమొచ్చినట్లు చేయించాడు వర్మ. అయితే సెన్సార్ కు ముందు ఈ ఇద్దరికి చాలా పెద్ద గొడవే జరిగింది. దాంతో కొన్ని సన్నివేశాలు పూర్తిగా కట్ చేసాడు ఈ దర్శకుడు. సినిమాలో పాల్ పేరును పీపీ చాల్ అని పెట్టాడు వర్మ. నేనే పిపి చాల్ అంటూ జేమ్స్ బాండ్ తరహాలో సాగిన ఈ పాట కూడా నవ్వు పుట్టించింది కానీ సెలెబ్రిటీస్ తో వర్మ చేయించిన స్పూఫ్ మాత్రం ఆకట్టుకోలేదు. పాల్ చేసిన రచ్చతో వర్మ కాస్త దిగొచ్చి సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ చేసాడు.

More Related Stories