బాబీకి మెగా ఆఫర్.. అక్కడ కూడా మల్టీస్టారర్.. Bobby
2019-12-13 11:55:38

వెంకీ మామ సినిమాతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాడు బాబీ. జై లవకుశ లాంటి సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ మామతో వచ్చాడు ఈయన. ఈ చిత్రానికి కూడా పర్లేదనే టాక్ రావడంతో బాబీని బాగానే నమ్ముతున్నారు నిర్మాతలు. ఈయనతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ సినిమా ఇస్తాడనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నాడు బాబీ. జై లవకుశ కూడా హిట్ కాదు.. అలాగని ఫ్లాప్ కూడా కాదు. అదో మంచి సినిమా అంతే. ఇప్పుడు వెంకీ మామ కూడా అంతే. దాంతో ఈ చిత్రం విడుదలకు ముందే గీతా ఆర్ట్స్ ఈ దర్శకున్ని లాక్ చేసిందని ప్రచారం జరుగుతుంది. అక్కడ ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించే బాధ్యతను బాబీపై అల్లు అరవింద్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ ఓ హీరోగా నటించబోతుంటే.. మరో హీరో పాత్ర కోసం ఇంకో హీరోను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాబీ. ఇప్పటికే ఈయన చెప్పిన లైన్ నచ్చడంతో పూర్తి కథ సిద్ధం చేయాల్సిందిగా మెగా కంపౌండ్ నుంచి బాబీకి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో అల్లు అర్జున్ తో పాటు నటించే ఆ హీరో ఎవరనేది మాత్రం ఇప్పట్లో తేలనట్లే. ఈ వివరాలు స్వయంగా చిత్రయూనిట్ అనౌన్స్ చేస్తామని చెబుతున్నట్లు టాక్. మొత్తానికి గీతా ఆర్ట్స్ లో మల్టీస్టారర్ వర్కవుట్ అయితే మాత్రం బాబీ దశ తిరిగిపోయినట్లే. 

More Related Stories