రానా చిరుత లాంటి చూపులు.. విరాట పర్వం లుక్ అదుర్స్..rana
2019-12-14 07:24:47

చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగ్ తో బిజీ అయిపోయాడు రానా దగ్గుబాటి. ఈయన నటిస్తున్న విరాట పర్వం షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సగం మొహాన్ని టవల్ తో కప్పి కళ్లను మాత్రం హైలైట్ చేస్తూ విడుదలైన పోస్టర్ ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి నక్స‌లైట్ పాత్రలో నటిస్తుంది. సాయి పల్లవి ఏంటి.. నక్సలైట్ ఏంటి ఏంటి పిచ్చిత‌నం కాక‌పోతేనూ అనుకోవచ్చు కానీ నిజంగానే ఈ ముద్దుగుమ్మ న‌క్స‌లైట్ అవుతుంది. అడ‌విలో అక్క పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. నీదినాది ఓకేకథ లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సినిమా చేసిన ద‌ర్శ‌కుడు వేణు

ఉడుగుల త‌న రెండో సినిమాను సాయిపల్లవితో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఇన్ని రోజులు రానా కోసం వేచి చూసారు. రానా వచ్చిన తర్వాత వేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. లేడీ ఓరియెంటెడ్ గానే కాకుండా రానాకు కూడా స్కోప్ ఉన్న పాత్రలోనే ఈ చిత్రం తెరక్కుతుంది. ఈ చిత్ర క‌థ‌తో ప్రేమ‌లో ప‌డిపోయింది సాయిప‌ల్ల‌వి. ఇందులో న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ తీసుకుంటున్నాడు వేణు ఉడుగుల‌. ఇత‌ర సినిమాల‌తో రానా బిజీగా ఉండ‌టంతో సెట్స్ పైకి రావ‌డానికి టైమ్ తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదిలా ఉంటే సాయిప‌ల్ల‌వికి నక్స‌లైట్ పాత్ర అంటే చిన్న విష‌యం కాదు. న‌ట‌న‌లో అదర‌గొట్టే ఈ ముద్దుగుమ్మ‌కు నక్స‌లైట్ లాంటి పాత్ర ప‌డిందంటే నెక్ట్స్ లెవల్లో ఉండటం ఖాయం. నీదినాది ఒకేక‌థతో ప్ర‌శంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయిన ఈ ద‌ర్శ‌కుడు.. ఈ సారి క‌మ‌ర్షియ‌ల్ గానూ హిట్ కొడ‌తాన‌ని ధీమాగా చెబుతున్నాడు. వచ్చే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. సాయిప‌ల్ల‌వితో వేణు ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నాడో..?

More Related Stories