బాలయ్యతో సినిమా మీద సోనాక్షి క్లారిటీson
2019-12-17 12:11:06

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రూలర్’. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన రెండో ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తి కాగా ఆ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ కూడా జారీ చేసారు.  ఈ సినిమా తర్వాత బాలయ్య.. బోయపాటి శ్రీను సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే సోనాక్షి సిన్హా  బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో నటించే విషయమై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో తాను నటించబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని ఖండించిన ఆమె తాను చేయబోయే తర్వాతి సినిమాను త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తానంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ భామ.. సల్మాన్‌ ఖాన్‌తో నటించిన ‘దబంగ్ 3’ కూడా ‘రూలర్’ రిలీజ్ రోజైన డిసెంబర్ 20న విడుదల కానుంది.

More Related Stories