స్టార్ హీరో సరసన ఇలియానాill
2019-12-17 12:22:59

ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయినా తమిళంలో పెద్దగా సినిమాలు చేయలేదు ఇలియానా. సౌత్ ఇండస్ట్రీ నుండి ఆఫర్లు కొరవడిన తరుణంలో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే ఆమె ఆశించిన మేరకు బాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఇలియానాకు హిందీలో అరకొరగా మాత్రమే ఆఫర్స్ వస్తున్నాయి. అది కూడా ప్రాధాన్యత లేని చిత్రాల్లో మాత్రమే ఇలియానాకు దర్శకులు ఆఫర్స్ ఇస్తున్నారు. జోరు తగ్గిన తన క్రమంలో ఆమె సౌత్ లో కూడా నటించే ఆలోచనలో ఉంది ఇలియానా. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం నటిస్తున్న 'వాలిమై' సినిమాలో ఆమెకి అవకాశం దొరికిందని అంటున్నారు. ఖాకి ఫేమ్ హెచ్ వినోద్ తెరక్కిస్తున్న ఈ సినిమాలో  అజిత్ కు జోడిగా యామి గౌతమ్ పేరుని పరిశీలించారని ఆమెను ఇంకా ఫైనల్ చేయకుండానే ప్రస్తుతం ఇలియానాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

More Related Stories