వెంకీ మామ కలెక్షన్స్.. దెబ్బకు పడిపోయిన వసూళ్లు..venky
2019-12-19 12:00:12

వెంకీ మామ తొలి మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసాడు. మామా అల్లుళ్లు కలిసి మంచి కలెక్షన్లు వసూలు చేసే సరికి సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. కానీ ఐదో రోజు నుంచి ఈ చిత్రం వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఐదో రోజు కేవలం కోటి 40 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది వెంకీ మామ. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 రోజుల్లో 25 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. కొన్ని రోజులుగా మంచి సినిమా ఏది రాకపోవడంతో వచ్చిన సినిమానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నిజానికి వెంకీ మామ గొప్ప సినిమా కాదు.. అందులో కూడా రొటీన్ స్టోరీ ఉంది. ఎప్పుడో 1990ల నుంచి చూస్తున్న మామా అల్లుళ్ల కథ. తెలిసిన కథే అయినా కూడా ఎమోషన్స్ బాగా పడటంతో వెంకీమామ వైపు ప్రేక్షకులు అడుగులు పడుతున్నాయి.

తొలిరోజు 7 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా తర్వాత రెండు రోజుల్లో మరో 10 కోట్ల పైగా వసూలు చేసింది. కానీ నాలుగో రోజు నుంచి పడిపోయాయి వసూళ్లు. ఎంత చేసినా ఎన్ని తీసుకొచ్చిన డిసెంబర్ 19 వరకే వెంకీ మామకు అవకాశం ఉంది. డిసెంబర్ 20న 4 సినిమాలు విడుదలవుతున్నాయి. దాంతో ఈ శుక్రవారం నుంచి వెంకటేష్ సినిమాకు వసూలు కచ్చితంగా తగ్గుతాయి. దాంతో దానికి ముందు ఎంత వీలైతే అంత వసూలు చేయడానికి మ్యాగ్జిమం ప్రయత్నిస్తున్నారు. కె ఎస్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అదే సినిమాకు కలెక్షన్లు తెచ్చిపెడుతుంది. దానికి తోడు పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా అందాల ఆరబోత కూడా వెంకీ మామకు ప్లస్ అయ్యింది. ఎటు చూసుకున్న కూడా ప్రస్తుతానికి వెంకీ మామ పరిస్థితి బాగానే ఉన్నా రెండో వారంలో కూడా కలెక్షన్లు తీసుకువస్తేనే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళుతుంది. 36 కోట్ల లక్ష్యంతో దిగిన వెంకీ మామకు అసలు పండగ ముందుంది.

More Related Stories