చరణ్ సలహా...ప్రొడక్షన్ హౌస్ స్థాపించనున్న ఎన్టీఆర్ Jr NTR
2019-12-23 20:55:49

ఈ మధ్య రామ్ చరణ్ తన సహచరులకి సలహాలు ఇవ్వడం ఎక్కువై పోయింది. నిన్నటికి నిన్న సినిమా సెట్స్ విషయంలో ప్రభాస్ కి ఏదో సలహా ఇవ్వగా ఇప్పుడు ఎన్టీఆర్ కి ఇంకేదో సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మంచి అనుబంధమే ఉంది. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ  చిత్రంలో ఎన్టీఆర్..కొమరం భీమ్ పాత్రలో నటిస్తే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి మొదటివారానికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. జూలై లోనే రిలీజ్ కాబట్టి ఏమి చేస్తారో ఎలా చేస్తారో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొని ఉంది. 

అయితే ఆ సంగతి పక్కన పెడితే తాజాగా రామ్ చరణ్ ఎన్టీఆర్‌కు ఒక సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. అదేంటంటే ఈ మధ్య హీరోలు దాదాపు అందరూ ఒక వైపు నటిస్తూనే మరో పక్క నిర్మాతలుగా రాణిస్తున్నారు. రామ్ చరణ్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, అంతెందుకు ఈ మధ్యన వచ్చిన విజయ్ దేవరకొండ కూడా ఒకవైపు హీరోగా నటిస్తూనే మరో పక్క నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా తనకంటూ సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయం ముందు నుండీ మదిలో ఉన్నాచరణ్ ప్రోత్సాహంతో అది కార్య రూపం దాల్చనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే అన్న కళ్యాణ్ రామ్‌ కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, బాబాయి బాలయ్యకు ఎన్బీకే ఫిల్మ్స్  బ్యానర్ లు ఉన్నా తనకూ ఒకటి ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట జూనియర్. దీంతో ఎన్టీఆర్ కూడా తన తండ్రి కొడుకు పేర్లు కలిసేచ్చేలా ‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ హౌస్ స్థాపించిబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

More Related Stories