వైల్డ్ డాగ్‌గా వస్తున్న నాగార్జున.. హిట్ కోసం వేట..Wild Dog First Look
2019-12-27 18:23:29

బిగ్ బాస్ తర్వాత నాగార్జున ఏం చేయబోతున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ప్రస్తుతం కొత్త దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈయన. కొన్ని రోజుల కింద మన్మధుడు 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పైగా నాగార్జునకు విమర్శలు కూడా తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయడం అవసరమా అంటూ ఆయనకు సోషల్ మీడియాలో చాలా సెటైర్లు వచ్చాయి. దాంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున. 

ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన బంగార్రాజు కథ సిద్ధంగా ఉన్నా కూడా దాన్ని పక్కనబెట్టి మరి ఇప్పుడు సోలోమెన్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాడు నాగ్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న నాగార్జున.. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసాడు. చాలా రోజుల తర్వాత రీ ఫ్రెష్ మెంట్ ఉన్న సినిమాలో నటిస్తున్నానంటూ ట్వీట్ చేసాడు. కుర్రాళ్ళతో పని చేయడం హాయిగా ఉందంటున్నాడు నాగ్. ఈ చిత్రానికి వైల్డ్ డాగ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇదిలా ఉంటే మన్మధుడు 2 తీసుకొచ్చిన చెడ్డ పేరు ఎలాగైనా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు నాగార్జున. అందుకే బంగార్రాజు లాంటి సినిమా కాకుండా ఒక హుందాతనం ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో వస్తున్నాడు. ఇందులో నాగ్ లుక్ కూడా అదిరిపోయింది. వచ్చే ఏడాది కచ్చితంగా హిట్ కొడతానంటూ ధీమాగా చెబుతున్నాడు నాగార్జున. మరి ఈయన నమ్మకాన్ని కొత్త దర్శకుడు ఎంతవరకు నిలబెడతాడో చూడాలిక.

More Related Stories