మహేష్ బాబు న్యూ ఇయర్ సంబరాలు అక్కడేనట..mb
2019-12-28 03:33:18

టాలీవుడ్ లో ఫ్యామిలీకి అతిముఖ్య‌మైన ప్రాధాన్య‌త ఇచ్చే హీరోల్లో మ‌హేశ్ బాబు ముందుంటాడు. షూటింగ్ కు బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీని తీసుకుని విదేశాల‌కు వెళ్లిపోతాడు సూప‌ర్ స్టార్. షూటింగ్ కు గ్యాప్ దొరక్క‌పోయినా.. వీలు చేసుకునీ మ‌రి వెళ్లిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కొన్ని రోజులుగా ఈయన అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది.. ప్రమోషన్స్ కూడా వేగంగానే జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అనుకున్న టైమ్ లో పూర్తైపోతుంది. దాంతో మరో బ్రేక్ తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఈయన త్వరలోనే కుటుంబంతో కలిసి మరోసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఈయన కొత్త ఏడాది కోసం యూర‌ప్ ట్రిప్ వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అక్కడే న్యూ ఇయర్ సంబరాలు చేసుకోబోతున్నాడు సూప‌ర్ స్టార్. మ‌హేశ్ అండ్ ఫ్యామిలీతో పాటు గల్ల జయదేవ్ కుటుంబం కూడా వెళ్లనుందని.. అక్కడే అంతా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన గతంలో కూడా ఇలాగే కొత్త ఏడాది కోసం విదేశాలు వెళ్లాడు. అప్పట్లో బావ ఫ్యామిలీతో పాటు యూరప్ వెళ్లి అక్కడే క్రిస్ మ‌స్ సంబ‌రాలు చేసుకున్నాడు.. ఆ తర్వాత స్విట్జ‌ర్లాండ్ లోని జూరిచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఇలాంటి ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. జనవరి 11న విడుదల కానుంది సరిలేరు నీకెవ్వరు. వచ్చిన తర్వాత ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు సూపర్ స్టార్.

More Related Stories