బాబు సుడిగాలి సుధీర్.. నీకు హీరోగా అవసరమా..sud
2019-12-30 05:04:25

ఇండస్ట్రీలో ఎవరైనా హీరో కావచ్చు. టాలెంట్ ఉన్న వాళ్లకు ఇక్కడ అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. హీరో కావడానికి అందంగానే ఉండాలనే రూల్స్ కూడా లేవు. అందుకే చాలా మంది మన ఇండస్ట్రీలో హీరోలు అవుతూ ఉంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. బుల్లితెరపై ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాతో హీరో అయ్యాడు. ఈ సినిమా విడుదలకు ముందు చాలా హంగామా చేశాడు సుడిగాలి. అంతేకాదు తన డెబ్యూ మూవీ కోసం బుల్లితెర యాంకర్స్ అందర్నీ ఒక దగ్గరకు తీసుకొచ్చాడు. తన సినిమాకు బాగానే ప్రమోషన్ చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే ఎన్ని చేసినా కూడా సినిమాలో కథను పట్టించుకోకుండా కేవలం తన క్రేజ్ తో ఆడుతుందిలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈయనలో ఎక్కువగా కనిపించింది. హీరో అయ్యాడు.. కానీ హీరో కావడానికి ఉండే కథను మాత్రం పట్టించుకోలేదు. తనకు డబ్బులు వస్తే చాల్లే అనుకున్నట్లు ఈ సినిమా చేశాడు సుడిగాలి సుధీర్.

ఇలాంటి సినిమాలో హీరోగా నటించడం కంటే జబర్దస్త్ లో కామెడీ వేషాలు వేసుకోవడం బెటర్ కదా అంటున్నారు విశ్లేషకులు. అనవసరంగా ఇలాంటి సినిమాలు చేసి ఉన్న ఇమేజ్ కూడా ఎందుకు పోగొట్టుకుంటావ్ సుధీర్ అంటూ ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇంకోసారి హీరోగా ప్రయత్నించాలి అని ఆలోచన వచ్చినప్పుడు కాస్త కంటెంట్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలా కాదని మరోసారి ఇలాంటి సినిమానే చేస్తే దానికంటే జబర్దస్త్ చేసుకోవడం నయం అంటూ కాస్త ఘాటుగానే నెటిజన్లు సుధీర్ కు తలంటు పోస్తున్నారు. మరి ఈ సలహాలను ఈ సుడిగాలి కమెడియన్ ఎంతవరకు తీసుకుంటాడో చూడాలి.

More Related Stories