కార్తికేయ సరసన అందాల రాక్షసిLavanya Tripathi
2020-01-01 17:38:47

RX 100 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపుగా నిరాశ పరిచినా కొత్త మూవీ ఆఫర్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. హీరో గానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా కార్తికేయ నటిస్తున్నారు. ఒక నూతన దర్శకుడు రూపొందించనున్న మూవీ కి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘చావు కబురు చల్లగా’ అనే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ ను ఈ మధ్యన విడుదల చేసారు. ఇందులో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. బన్నివాస్, సునీల్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించనుంది. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. సినిమా షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మూవీ లో కార్తికేయ కు జోడీ గా లావణ్య త్రిపాఠి నటించనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. సినిమా ఫలితాలను లెక్కచేయకుండా జిమ్ లో కసరత్తులు చేస్తూ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టిన ఈ యువ హీరోకి ఎక్కువగా ప్రతినాయక పాత్రలకి సంబందించిన ఆఫర్స్ రావడం విశేషం.  
 

More Related Stories