కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సాయి తేజ్ ప్రతిరోజూ పండగేPrati Roju Pandage
2020-01-02 00:58:10

సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా యూత్ ఫుల్ సినిమాలను తెరకెక్కించే మారుతీ దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ ప్రతి రోజూ పండగే. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా నైజాంలో సాయి తేజ్‌ కు తన కెరీర్ లోనే గుర్తుంచుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది.  డీసెంట్ టాక్‌తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండగే  రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాలి థమన్ ఎస్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన “ప్రతి రోజూ పండగే ” మూవీ అంచనాలకు చేరుకొంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై కుటుంబ విలువల నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన “ప్రతి రోజూ పండగే ”10 రోజులలో వరల్డ్ వైడ్ గా 45 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సాయి ధరమ్ సినీకెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టుతున్న మూవీగా నిలిచింది. తాజాగా ఈరోజు విడుదల చేసిన పోస్టర్స్ బట్టి ఈ సినిమా 52 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. 
 

More Related Stories