రానా ఆరోగ్యం గురించి ఫీలర్స్...అందుకేనా Rana Daggubati
2020-01-04 13:38:36

రానా ఆరోగ్యం చెడిపోయిందని, ఆయనకి ఏమి వ్యాధి వచ్చిందో అర్ధం కావడం లేదని, మరో సారి ఆయనకి కిడ్నీ చెడిపోతే దానిని రీప్లేస్ చేయిన్చుకున్నారని, ఆయన తల్లే ఆయనకి కిడ్నీ ఇచ్చిందని ఇలా ఒకటి కాదు, రకరకాల వ్యాఖ్యానాలు హల్చల్ చేసేవి. ఈమధ్య 2-3 పబ్లిక్ ఫంక్షన్లలో కూడా ఆయన బక్క చిక్కే కనిపించాడు. అలాగే మత్తువదలరా ప్రమోషనల్ ఈవెంట్ కోసం మీడియా ముందుకొచ్చి కూడా అలానే కనపడ్డాడు రానా. అయితే ఎందుకొచ్చిన రచ్చ అనుకున్నారో ఏమో ముందు నుండే ఫీలర్స్ వదులుతోంది దగ్గుబాటి కాంపౌండ్. రానా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వారి నుండి ఫీలర్స్ వదిలారు. ఈ బక్కపలచని దేహం అదీ రానా నటించబోయే విరాటపర్వం సినిమా కోసమే అని అంటున్న్నారు. రానా నటించిన హాథీ మేరే సాథీ సినిమా విడుదల కావలసి ఉండగా ఆయన 'విరాటపర్వం' 'హిరణ్యకశిప' అనే సినిమాల్లో నటించనున్నారు. త్వరలో షూట్ కి వెళ్లనున్న హిరణ్యకశిప సినిమాని గుణశేఖర్ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనే నిర్మిస్తోంది. విరాటపర్వం సినిమాలో రవన్న అనే నక్సలైట్ పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఈ బక్క పలచని దేహం మేకోవర్ మాత్రమేనని ఆరోగ్య సమస్య కాదని అంటున్నారు.  

More Related Stories