పవన్ కల్యాణ్‌ను సపోర్ట్ చేసిన అల్లు అర్జున్..Allu Arjun
2020-01-08 01:27:07

అసలే ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులంతా బన్నీపై మండిపడుతుంటే ఇప్పుడు ఏంటి కొత్తగా ఇది అనుకుంటున్నారా..? అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో బన్నీ మాటలకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. చిరంజీవి ఒక్కడే తనకు ప్రాణం అని చెప్పిన ఈయన.. పవన్ గురించి కనీసం మాట్లాడలేదు. అభిమానులు అరుస్తుంటే ఏదో తూతూ మంత్రంగా అలా పవన్ కల్యాణ్ అనేసాడు అంతే. కానీ ఎన్ని చేసినా కూడా ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు బన్నీ చేసిన పనితో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

తనకు తెలిసి చేసాడా.. లేదంటే అలా అనుకోకుండా జరిగిందా తెలియదు కానీ ఇప్పుడు నిజంగానే బన్నీ మాటలకు పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తెలుగు భాష విషయంలో పవన్ వెంట నడిచాడు బన్నీ. అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో తెలుగు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు బన్నీ. తాను చిన్నప్పటి నుంచి తన తండ్రిని తాను డాడీ అని పిలిచానని.. కానీ తన పిల్లలు మాత్రం తనను నాన్న అని పిలుస్తున్నారని చెప్పాడు. నేటితరానికి తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాలని.. చెప్పే ఆవశ్యకత కూడా ఏర్పడిందని చెప్పాడు బన్నీ. ఈ విషయంలో పవన్ కూడా చాలా పోరాడుతున్నాడు. జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు తనకు తెలియకుండానే ఈ విషయంలో పవన్ కల్యాణ్‌ను సపోర్ట్ చేసాడు అల్లు అర్జున్. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

More Related Stories