సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కి బాలయ్య మళ్ళీ ఛాన్స్nbk
2020-01-08 05:20:14

బాలయ్య ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇస్తాడో చెప్పలేం. స్టార్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా చాలా కాలం విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత సినిమా విడుదలయినా ప్రస్తుతం ఆయన చేతుల్లో ఏ సినిమా లేదు. ఈ క్రమంలో బాలయ్య పిలిచి మరీ బి.గోపాల్ అవకాశం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.జై సింహా చేశాడని మొన్న రులర్ సినిమా ఇచ్చి దేబ్బయిన బాలయ్య ఇప్పుడు బి.గోపాల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య ఆయనకు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణ దగ్గరికి ఒక మంచి స్టోరీ వచ్చిందట. ఆ కథను బి.గోపాల్ అయితేనే సమర్థవంతంగా తెరకెక్కించగలడనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడినట్టు సమాచారం. బాలకృష్ణ - బి. గోపాల్ లు ఇద్దరూ ఓకే అంటే  బోయపాటి తరువాత బాలయ్య చేసే సినిమా ఇదే అవ్వచ్చని అంటున్నారు. ఈ సినిమాని బాలయ్య సొంత బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించవచ్చని అంటున్నారు.

More Related Stories