అల వైకుంఠపురములో రివ్యూ వచ్చేసింది...అదిరిపొయిందటAla Vaikuntapuram First Review.jpg
2020-01-11 23:40:23

సంక్రాంతి సినిమాల జోరు మొదలయిపోయింది. ఈరోజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కాగా రేపు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో రిలీజ్ కానుంది. అయితే సినిమాకి ముందుగానే ఈ సినిమా రివ్యూ కూడా వచ్చేసింది. నిజానికి రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అయినా అమెరికాలో మాత్రం ప్రీమియర్ షోలు పడిపోయాయి. అవి కాక నిన్న ఇచ్చినట్టుగానే ముంబై ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం కూడా తన రివ్యూ ఇచ్చేసాడు.

ఈయన సినిమా స్టన్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టేశాడు. అంతే కాక ఈ సినిమా వన్ మ్యాన్ ఆర్మీ అని, సినిమా మొత్తాన్ని బన్నీ తన భుజాన్ వేసుకుని నడిపించాడని పేర్కొన్నారు. ఈ సినిమాకి బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుందని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి 4 విజువల్ ఎఫెక్ట్స్ కు 3.. యాక్షన్‌ సీక్వెన్సులకు 4.. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభకు 3.5.. సహాయ నటులకు 3.5... ఎడిటింగ్‌కు 3.. స్క్రీన్ ప్లేకు 3.5.. సినిమాటోగ్రఫీకి 3.5.. నేపథ్య సంగీతానికి 3.5.. కథకు 3.5.. హీరోయిన్ పూజాకి 3.5..చొప్పున రేటింగ్ ఇచ్చాడు. అలాగే ఓవరాల్ గా సినిమాకి కూడా 3.5 రేటింగ్ ఇచ్చాడు.

విడుదలకు ముందే ఇలా రేటింగ్ సహా పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్ రిలాక్స్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి సంక్రాంతికి వచ్చిన మూడో సినిమా కూడా మంచి టాక్ రావడం ఖాయమని తేలడం సంతోషించే విషయమే.

More Related Stories