అశ్వినిదత్‌పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..Aswinidutt.jpg
2020-01-13 15:38:53

చిరంజీవికి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు అశ్వినిదత్. ఈ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. స్వయంగా తన కొడుకు రామ్ చరణ్ ను కూడా అప్పట్లో ఈయన చేతుల్లోనే పెట్టాడు చిరంజీవి. దాన్నిబట్టి ఈ ఇద్దరి రిలేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయాలు ఎలాంటి వాళ్లలో అయినా మార్పు తీసుకొస్తాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన ఇప్పుడు చిరంజీవిని రాజకీయంగా విమర్శించడం ఆయనకే కాదు ఆయన అభిమానులకు కూడా మింగుడుపడటం లేదు.

ఎప్పుడూ చిరంజీవి గారూ అంటూ పిలిచే అశ్వినిదత్ ఈ రోజు మాత్రం అదిరిపోయే పంచులేసాడు. ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి మద్దతు తెలుపడమే ఇప్పుడు అశ్వనీదత్ తో చిరు వైరానికి దారి తీసింది. అసలు చిరు లాంటి వాళ్లను పక్కనబెట్టుకుని జగన్ ఏం చేస్తాడో చూద్దాంలే అన్నట్లు చులకనగా మాట్లాడాడు అశ్వనీదత్. చిరంజీవికి ఏం తెలుసని ఈ విషయం గురించి మాట్లాడాడంటూ నిలదీసాడు ఈ నిర్మాత. ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఈ కాంబోలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి వైజయంతీ బ్యానర్ వాల్యూ పెంచింది. చూడాలని ఉంది బ్లాక్ బస్టర్.. ఇంద్ర ఇండస్ట్రీ హిట్.. జై చిరంజీవ ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు నష్టం లేదు.

ఇంత చేసిన చిరంజీవిని రాజధాని విషయంలో పబ్లిగ్గా విమర్శించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. పవన్ ను చూసి నేర్చుకోవాలి.. ఆయనకేం తెలుసు అన్నారు అశ్వినిదత్. దీనిని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత టీడీపీ అభిమాని అయితే చిరంజీవినే విమర్శిస్తారా అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వార్ చాలా దూరం వెళ్లేలా కనిపిస్తుంది.

More Related Stories