బాహుబలి రికార్డులు దాటేసిన అల వైకుంఠపురములో.. Ala Vaikunthapurramuloo
2020-01-13 18:26:38

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన అల వైకుంఠపురములో బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. ఇంటా బయటా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ సినిమా ఇదే అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ టాక్ విన్న తర్వాత బన్నీ కూడా మూడు రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడు. 

జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ రూపంలో ఓవర్సీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కడ ఈ చిత్రం సంచలన విజయం సాధించే దిశగా అడుగులేస్తుంది. బన్నీ, త్రివిక్రమ్ గత సినిమాల రికార్డులనే కాదు.. ఏకంగా బాహుబలి రికార్డులను సైతం దాటేస్తుంది ఈ చిత్రం. అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌ను రాబడుతోంది. 

అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా 5 షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. బాహుబలి కూడా ప్రీమియర్స్ రూపంలో అక్కడ 21,290 డాలర్లు మాత్రమే తీసుకొచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వసూలు చేసింది అల వైకుంఠపురములో. ఈ విషయంలో సరిలేరు నీకెవ్వరును కూడా బన్నీ సినిమా దాటేసింది. మొత్తానికి విడుదలైన అన్నిచోట్లా అల వైకుంఠపురములో సంచలనాలు రేపుతుంది. 

More Related Stories