వర్మ మీదనే బయోపిక్..ఆరు నెలలలో రిలీజ్ !rgv
2020-01-15 03:20:52

వర్మ అంటే వివాదం వివాదం అంటే వర్మ అనేట్టు తయారయ్యాడు మన టాలీవుడ్ డైరెక్టర్ వర్మ. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్‌ చేస్తూ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా భీబత్సంగా డిజాస్టర్ అయినా అవేమీ పట్టని వర్మ మరో సినిమా బ్యూటిఫుల్ పేరుతో రిలీజ్ చేశాడు. ఆ సినిమా కూడా పోవడంతో ప్రస్తుతం ఇంటర్‌నేషనల్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు వర్మ. అయితే నిజానికి ఒక చానల్ లో రచయిత జొన్నవిత్తుల ఆర్జీవీ తీసే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా గురించి మాట్లాడుతుంటే అదే చర్చ వేదికలో ఉన్న రామ్ గోపాల్ వర్మ అసలు జొన్నవిత్తుల ఏమి చెప్పాడో తాను వినలేదని, అతడి గురించి పట్టించుకోవలసిన అవసరం కూడా లేదని అనడంతో జొన్నవిత్తుల కోపం వచ్చింది. ఆయన ఏదో అనడం దానికి కౌంటర్ గా జొన్నవిత్తుల చౌదరి కావడంతోనే ఇంతా హడావిడి చేస్తున్నాడని అతడి కులం పేరు పెట్టి దూషించడంతో ఆయన మరింత ఆగ్రహంగా నీపై ఆరు నెలలో సినిమా తీసి నీ సంగతి చూస్తానని చెప్పుకొచ్చారు. దీనిని అప్పట్లో ఆర్జీవీ కూడా స్వాగతించారు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ అనే టైటిల్‌తో నిజంగానే సినిమాను రూపొందించేందుకు జొన్నవిత్తుల రెడీ అయ్యారు. ఈ సినిమాకు ఒక సైకో బయోపిక్‌ అనేది ట్యా్గ్‌ లైన్‌ అంట. ఈ సినిమాని పూర్తి చేసి మరో ఆరు నెలలలో రిలీజ్ కూడా చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తాను తీసే సినిమలాకి రకరకాల సినిమాల్ని వెరైటీ వెరైటీగా ప్రమోట్ చేసుకునే వర్మ ఈ సినిమాని చూడమని జానాలకి చెబుతాడో లేదో ?

More Related Stories