వామ్మో ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గట్లేదుగాvij
2020-01-16 12:00:56

తెలుగులో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అని బిరుదులూ అందుకున్న విజయశాంతి క్రేజ్ మామూలుది కాదు. తెలుగులో స్టార్ హీరోలకు సమానమైన స్టార్ డమ్ ఆమె సంపాదించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది ఆమె. అక్కడితో ఆగక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అప్పట్లోనే ఆమె ట్రెండ్ సెట్టర్. కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలు ఎన్నటికీ మరువలేము. ఒకపక్క పెద్ద హీరోల పక్కన సిన్మాలు చేస్తూనే ఆమె ఇలా సోలో సినిమాలు చేసి వారితో సమానంగా హిట్స్ అందుకున్నారు. ఆమె పదమూడేళ్ల గ్యాప్ తరువాత కూడా వెండి తెరపై తన క్రేజ్ ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో లెక్చరర్ భారతిగా ఆమె అద్బుతంగా నటించారు. ఇక సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సెట్స్ లో పర్ఫెక్ట్ కిక్ ఇస్తున్న విజయ శాంతి వీడియో  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియోను మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు బ్రహ్మజీకి కాలితో కిక్ ఇస్తోన్న ఆమెను చూస్తే అప్పట్లో ఆమె చేసిన యాక్షన్ సీన్స్ గుర్తుకురాక తప్పదు. 55ఏళ్ల విజయశాంతి అలా ఓ అద్భుతమైన కిక్ ఇవ్వడం ఆమె ఫిట్ నెస్, ఎనర్జీ లెవెల్స్ కి సాహో అనాల్సిందే.

 

More Related Stories