ఆర్ఆర్ఆర్ లో లేను...స్టార్ హీరో సంచలనంkicha
2020-01-21 05:17:59

బాహుబలి సిరీస్ తో టాలీవుడ్‌ రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌ఎస్ రాజమౌళి తెరకేక్కిస్తోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టిస్టారర్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో నటిస్తుండగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. ఈ ఏడాది జూలై 30న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటివరకు 80 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ఒకటి సినీ వర్గాలలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ఇప్పటికే సముద్రఖని, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ నటిస్తుండగా ఈ సినిమా కోసం పోలీసాఫీసర్ పాత్రలో కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుదీప్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. `ఈ సినిమా మీద గౌరవంతో ఒక విషయం చెప్పదలచుకున్నాను. నేను `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నానంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజాలు కావు. ఇప్పటివరకు నన్ను `ఆర్ఆర్ఆర్` టీమ్ నుంచి ఎవరూ సంప్రదించలేదు. నాతో ఎవరూ మాట్లాడలేద`ని సుదీప్ స్పష్టం చేశాడు.

More Related Stories